కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ కు అస్వస్థత

  • మనీ లాండరింగ్ కేసులో శివకుమార్ ను విచారిస్తున్న ఈడీ
  • నిన్న రాత్రి అరెస్ట్ చేసిన అధికారులు
  • నేడు కోర్టులో ప్రవేశపెట్టనున్న ఈడీ
కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ ను నిన్న రాత్రి ఢిల్లీలో ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రూ. 8.59 కోట్లకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసుతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణపై ఆయనను అదుపులోకి తీసుకున్నారు. శివకుమార్ తో పాటు ఢిల్లీలోని కర్ణాటక భవన్ ఉద్యోగి హనుమంతయ్య, మరికొందరిపై కూడా కేసులు నమోదు చేశారు.

గత నాలుగు రోజులుగా శివకుమార్ ను ఈడీ అధికారులు ఢిల్లీలో విచారిస్తున్నారు. ఈరోజు ఆయనను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు, ఈ ఉదయం శివకుమార్ అస్వస్థతకు గురయ్యారు. శివకుమార్ అరెస్ట్ నేపథ్యంలో కర్ణాటకలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాయి.
Go Back to Shorts
DK Shivakumar
Congress
ED

More Telugu News